బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.తొలిసారిగా మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ప్రియాంక.ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఇందులో ప్రియాంక నటించిన అమ్ములు పాత్ర మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తొస్తూ ఉంటుంది.ఈ సీరియల్ లో తాను మూగ అమ్మాయిగా నటించి ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ప్రియాంక జైన్.
ఇక ప్రియాంక తన అందంతో కూడా బాగా ఆకట్టుకుంది.
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అందులో గోలి సోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.
ప్రస్తుతం తాను జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సీరియల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రియాంక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ షాక్ ఇస్తుంది.నిజానికి తన గ్లామర్ ఫోటోలని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ప్రియాంక తనతో కలిసి మౌనరాగంలో నటించిన అంకిత్ అలియాస్ శివ కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే కలిసి తిరుగుతున్నారు.
ఇక వీరిద్దరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

అప్పుడప్పుడు ప్రియాంక శివ ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఏదైనా బుల్లితెర ఈవెంట్ లో కూడా ఇద్దరు కలిసి స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తుంటారు.ఇదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ప్రియాంక కొన్ని మోటివేషనల్ స్టోరీస్ పంచుకుంటూ ఉంటుంది.
ఇక ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.అందులో ఇప్పటికి చాలా విషయాలు పంచుకుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరొక వీడియో పంచుకుంది.అందులో కొత్త కాపురం పెడుతున్నాము దానికోసం కొత్త సామాన్లు తీసుకుంటున్నాము అని వీడియో పంచుకుంది.పెళ్లి చేసుకోకుండా వాళ్ళు కొత్త కాపురం పెడుతున్నారు అని తెలియడంతో నెటిజన్స్ వారిని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ముందైతే పెళ్లి చేసుకోండి.

ఆ తర్వాత కాపురం గురించి ఆలోచించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ఎప్పుడు పెళ్లి కోసం అవి కొంటున్నాను ఇవి కొంటున్నాను అంటున్నాను కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాలేవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్లు చేసుకుంటూ పోతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా హల్ చల్ చేస్తుంది.







