తెలంగాణలో తొలిసారి ప్రియాంక గాంధీ బహిరంగ సభ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో తొలిసారి బహిరంగ సభలో పాల్గొననున్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర త్వరలో నల్గొండకు చేరనుంది.

ఈ క్రమంలో నల్గొండలో ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.  జూన్ మొదటివారంలో జరిగే సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు