మెద‌క్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయాలిః వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ.హ‌నుమంత‌రావు స‌రికొత్త డిమాండ్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు.

తెలంగాణ‌లోని మెద‌క్ లోక్ స‌భ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేయ‌లనే ప్ర‌తిపాద‌న తెచ్చారు.ప్ర‌స్తుతం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొన‌సాగుతూ.

ఇటీవ‌లే ద‌క్షిణాది రాష్ట్రాల పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే.అనంత‌రం, త‌న ప్ర‌తిపాద‌న‌కు బ‌లం చేకూరేలా ఓ కీల‌క ప‌రిణామాన్ని వీహెచ్ ప్ర‌స్తావించారు.

గ‌తంలో పార్టీ అధినేత్రిగా వ్య‌వ‌హ‌రించిన భార‌త దివంగ‌త ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేసి గెలిచిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.త‌న నాన‌మ్మ మాదిరే ప్రియాంకా గాంధీ కూడా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మెద‌క్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌తిపాదించారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide