ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తోంది.కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) విజయం తరువాత తెలంగాణలో కూడా సాధిస్తే పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లేనని హస్తం నేతలు భావిస్తున్నారు.
అందుకే తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి.ప్రస్తుతం టి కాంగ్రెస్( Telangana congress ) నేతలు కూడా విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో వారిలో మరింత జోష్ నింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది.సరిగ్గా ఎన్నికలకు ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ అయిదు నెలల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే జెండా పాతేయ్యొచ్చు అని భావిస్తోంది అధిష్టానం.

ముఖ్యంగా తెలంగాణ విషయంలో ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) అన్నీ తానై చూసుకుంటున్నారు.రాష్ట్ర నేతలతో ఆప్యాయంగా పలకరిస్తూ, తాన వాక్చాతుర్యంతో తెలంగాణ ప్రజలకు దగ్గరవుతున్నారు.ఇక ఈ ఐదు నెలల్లో నెలకు కనీసం రెండుసార్లు ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన ఉండేలా చూసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.ఈ నెల 25 న ఆమె తెలంగాణకు రానున్నారు.
ఆ మద్య రాష్ట్రంలో జరిగిన నిరుద్యోగ సభలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.ఇక తదుపరి ఖమ్మం( Khammam )లో జరిగే సభ కోసం మరోసారి ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఈసారి ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఫోకస్ తెలంగాణపై ఎక్కువగా ఉండడంతో ఆమె తెలంగాణలో ఏదో ఒక నియోజిక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో లేదో తెలియదు గాని, ప్రస్తుతం తెలంగాణపై ఆమె ఫోకస్ చూస్తుంటే నిజమేనేమో అనే అనుమానం కలుగక మానదు.కర్నాటక ఎన్నికల టైమ్ లో కూడా ప్రియాంక గండి పర్యటనలు ఆ పార్టీకి చాలా పెద్ద ప్లేస్ అయింది.ఇప్పుడు తెలంగాణపై కూడా అదే విధంగా పర్యటనలు చేస్తుండడంతో ప్రియాంక గాంధీ చొరవా హస్తం పార్టీకి ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.
