ప్రధాని నరేంద్ర మోదీ- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.ఒకరిని ఇరికించడానికి మరొకరు నిత్యం ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపిలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయింది.ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.

మరోవైపు ఫిబ్రవరి 4న అమిత్ షా విజయనగరంలో బస్సు యాత్రను ప్రారంభిస్తారు.21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, 25 పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్రాలతో సమావేశం, 26న ఒంగోలు కార్యక్రమంలో అమిత్షా పాల్గొంటారని కన్నా తెలిపారు.







