తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా జగిత్యాల( Jagtial )కు వెళ్లనున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ( Vijaya Sankalpa Sabha )లో పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ( Narendra Modi ) పర్యటనలో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఎనిమిది జిల్లాల నుంచి సుమారు 1,600 మందితో భద్రత కల్పిస్తున్న పోలీసులు రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మోదీ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







