కాసేపట్లో హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో

హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

ఈ మేరకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు.

చిక్కడపల్లి, నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోదీ రోడ్ షో కొనసాగనుంది.కాగా ఇప్పటికే మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దీంతో పాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సైతం మూసివేయనున్నారు.అయితే బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు