హై హై నాయకా : కేటీఆర్ చుట్టూ నాయకుల ప్రదక్షణలు

తెలంగాణకు కాబోయే సీఎంగా కేటీఆర్ పేరు మారుమోగుతుండడంతో అప్పుడే టీఆర్ఎస్ లో ఎక్కడలేని సందడి నెలకొంది.

కేటీఆర్ అనుగ్రహం కోసం నాయకులు తంటాలు పడుతూ ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

అదీకాకుండా సీఎంగా బాధ్యతలు చేపట్టకుండానే అప్పుడే కేటీఆర్ తన మార్క్ చూపిస్తుండడంతో కేటీఆర్ పట్టాభిషేకానికి సమయం దగ్గరకు వచ్చేసిందన్న ఆలోచనకు నాయకులు వచ్చేసారు.ఇక కేటీఆర్ కూడా అదే స్థాయిలో వ్యవహరిస్తూ పాలనలో తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు.

టీఆర్ఎస్ ఇచ్చిన అన్ని హామీలు వందశాతం నెరవేర్చాలని అవినీతి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ నేతలకు గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు.ముఖ్యంగా కొత్త మున్సిపల్ వచ్చింది కాబట్టి నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటూ పదే పదే ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తుండడంతో ఎమ్మెల్యేలతో పాటు కింది స్థాయి నాయకుల్లో చాలా మార్పు కనిపిస్తోంది.తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మునిపల్ చైర్మన్ లు వారితో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Advertisement

ఆయన కోసం ప్రగతి భవన్ లో వేచి చూస్తూ ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు పై పెద్దగా దృష్టి పెట్టలేదు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు.అయితే ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమలు చేసి ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీ పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నారు.కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత ప్రజలు తమకు సమస్యలు చెబుతున్నారని, ఏదో ఒకటి చేయక పోతే నిధుల విడుదల తగ్గిపోతుందని, కనీసం రాబోయే బడ్జెట్లో అయినా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయించుకుని ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు.

ఈనెల మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ నిధుల కోసం కేటీఆర్ చుట్టూ నాయకులు ప్రదర్శనలు చేస్తూ ఆయనపై తమపై ఆయన దృష్టి ఉండేలా చూసుకుంటున్నారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు