వేసవి కాలంలో ఎలాంటి చర్మ సమస్యలైనా.. ఈ మాస్క్ తో 15 రోజుల్లో చెక్..

వేసవి కాలంలో( Summer ) చాలా మంది వేడి కారణంగా చర్మం ( Skin ) ఎన్నో రకాల సమస్యలకు గురవుతూ ఉంటుంది.

ఇక మరీ ముఖ్యంగా వేసవికాలంలో చర్మం ట్యానింగ్ లేద నలుపు రంగులో మారిపోతుంది.

అంతేకాకుండా ఒక్కోసారి సున్నితమైన చర్మం ఉన్నవారు వడదెబ్బ అలాగే ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటారు.అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా శనగపిండిని ముఖానికి ఉపయోగించాలి.

ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు డెడ్ స్కిన్ ని( Dead Skin ) తొలగించడానికి ఉపయోగపడుతుంది.అలాగే ట్యానింగ్, చిన్నచిన్న మచ్చలు, మొటిమలు, ఆయిల్ స్కిన్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎందుకంటే ఇందులో సహజమైన గుణాలు లభిస్తాయి.అందుకే సులభంగా అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

అయితే శనగపిండి ట్యానింగ్ మాస్క్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మాస్క్ నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రెండు చెంచాల రోజ్ వాటర్, రెండు చెంచాలు పెరుగు, రెండు చెంచాలు శనగపిండి.

ట్యాన్ రిమూవల్ మాస్క్ ను తయారు చేసే పద్ధతి: శనగపిండి ట్యానింగ్ రిమూవల్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాలి.అందులో రెండు చెంచాల శనగపిండి, అలాగే రెండు చెంచాల పెరుగు, రెండు చెంచాల రోజ్ వాటర్ వేయాలి.దీన్ని మిశ్రమంగా తయారు చేయాలి.

అంతే ఇక దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.

ముందుగా ముఖాన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి.ఆ తర్వాత వేళ్ళ సహాయంతో ఈ మాస్క్ నీ ముఖానికి మొత్తం అప్లై చేసుకోవాలి.అలాగే మెడపైన కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఆరనివ్వాలి.ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

Advertisement

ఇలా క్రమం తప్పకుండా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు