తల్లి స్వీపర్.. సివిల్స్ లో సత్తా చాటిన కొడుకు.. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

సాధారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు సివిల్స్ లాంటి ఉన్నత పరీక్షలలో సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు.

అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించాలని భావించిన ప్రశాంత్ సురేశ్ భోజనే ( Prashant Suresh Bhojane ) వరుస వైఫల్యాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు.

ప్రశాంత్ వయస్సు 32 సంవత్సరాలు కాగా తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాలలో ఆయన 842వ ర్యాంక్ సాధించారు.మహారాష్ట్ర రాష్ట్రంలోని ఠాణె( Thane in Maharashtra ) ప్రాంతానికి చెందిన ప్రశాంత్ 2015 సంవత్సరం నుంచి సివిల్స్ సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు.

ఎన్నిసార్లు పోటీ పరీక్షలు రాసినా ప్రశాంత్ ఆశించిన ఫలితాలు అయితే రాలేదు.అయితే తాజాగా విడుదలైన ఫలితాల్లో ప్రశాంత్ కు మంచి ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు.

ప్రశాంత్ సక్సెస్ గురించి తెలిసి అతను నివశించే కాలనీవాసులు ర్యాలీ చేయడం విశేషం.

Advertisement

తన సక్సెస్ స్టోరీ గురించి ప్రశాంత్ మాట్లాడుతూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక కోచింగ్ సెంటర్ లో మాక్ పేపర్ల చెకింగ్ చేసేవాడినని ఇలా చేయడం ద్వారా చదువుకోవడంతో పాటు ఉపాధి లభించినట్లు అయిందని ఆయన అన్నారు.ఇంటికి వచ్చేయమని తల్లీదండ్రులు చెప్పేవారని నా విషయంలో వాళ్లు చాలా బాధలు పడ్డారని ప్రశాంత్ పేర్కొన్నారు.ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

ప్రశాంత్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ నా బిడ్డ ఉద్యోగం చేయాలని కోరుకునేవాడినని కానీ అతడు చేసింది సరైందేనని ఇప్పుడు అనిపిస్తోందని ఆయన తండ్రి చెప్పుకొచ్చారు.పారిశుద్ధ్య కార్మికుల పిల్లల్లోనూ ప్రతిభ ఉంటుందని వారిని చిన్నచూపు చూడకూడదని ప్రశాంత్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాడని ఇది మాకెంతో గర్వ కారణమని స్థానిక శ్రామిక సంఘాల నేతలు తెలిపారు.ప్రశాంత్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రశాంత్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..
Advertisement

తాజా వార్తలు