ఈ మంత్రులతో తంటాలే ? తేల్చేసిన పీకే ?

పార్టీని ప్రభుత్వాన్ని ఎంతగా పరుగులు పెట్టించాలి అని జగన్ చూస్తున్నా, అది మాత్రం సాధ్యపడడం లేదు.రావలసినంత క్రెడిట్ ప్రభుత్వానికి రావడం లేదు.

అలాగే ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో పార్టీ నాయకులు వెనకబడిపోతున్నారు.ప్రతి దశలోనూ ప్రతిపక్షాలదే పై చేయిగా నడుస్తుండడం వంటి కారణాలతో జగన్ చాలా ఆగ్రహంగానూ, అసంతృప్తితోనూ ఉంటూ వస్తున్నారు.

కొద్ది రోజుల క్రితమే వైసిపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగమేఘాల మీద ఏపీకి వచ్చి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారంలో ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తూ వస్తుండడం, వరుసగా ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి వ్యవహారాలతో జగన్ ఆయనను రంగంలోకి దింపారు.

మొత్తానికి ఏదో రకంగా ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.ఇక అప్పటి నుంచి పీకే బృందాలు ఏపీలో వివిధ అంశాలపై రిపోర్టులు తయారు చేసే పనిలో ఉన్నాయి.

Advertisement

తాజాగా ఏపీ మంత్రుల వ్యవహారాలకు సంబంధించిన రిపోర్టును సైతం ప్రశాంత్ కిషోర్ జగన్ కు అందించినట్లు తెలుస్తోంది.ఆ రిపోర్టులో ఏపీ మంత్రుల వ్యవహారం పై సమగ్రంగా రిపోర్ట్ అందించాడట.

మెజారిటీ మంత్రులు ప్రభుత్వానికి అటు పార్టీకి పెద్దగా ఉపయోగపడడం లేదని, వారి వల్ల ప్రయోజనం లేదని రిపోర్ట్ అందించాడట.అలాగే ప్రతి మంత్రి పనితీరుపైన సమగ్రమైన రిపోర్ట్ అందించడంతోపాటు, ఎవరెవరి పనితీరు ఏ విధంగా ఉంది అనే రిపోర్ట్ కూడా అందించినట్లు తెలుస్తుంది.

మెజార్టీ మంత్రులు పేరుకు ఉన్నారు తప్ప మొత్తం భారమంతా జగన్ పైనే వేశారని, చివరకు మంత్రుల సొంత జిల్లాలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో వారు ఉన్నారని, ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా, పార్టీకి ఉపయోగపడే విధంగా వ్యవహరించకుండా, పూర్తిగా పార్టీ పైనా, జగన్ పైనే భారం అన్నట్లుగా వారి వ్యవహారం ఉంటోందని, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రభుత్వం, పార్టీ తరపున సమాధానం చెబుతున్నారని రిపోర్ట్ ఇచ్చారట.కొంతమంది ఇంచార్జి మంత్రుల పనితీరు ఫర్వాలేదు అనే రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు పై వైసీపీ కీలక నాయకులతో జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పంచాయతీ, తిరుపతి ఉప ఎన్నికల తంతు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి, మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకులను మంత్రులుగా ఎంపిక చేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు సమాచారం.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు