ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తిన ప్రణీత

భావ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ప్రణీత శుభ.

మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా తరువాత ఈ అమ్మడుకి అవకాశాలు బాగానే వచ్చాయి.

అయితే తెలుగులో కంటే మాతృభాషలోనే స్టార్ హీరోయిన్ గా ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో పవన్ కళ్యాణ్, తారక్ లాంటి స్టార్స్ తో నటించిన అక్కడ సెకండ్ లీడ్ రోల్స్ కి పరిమితం అయిపోవడం, ఆపై సినిమాలు డిజాస్టర్ కావడంతో తరువాత టాలీవుడ్ నుంచి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

టాలీవుడ్ కాదన్న మాతృభాష మాత్రం ప్రణీతకి మంచి గౌరవం ఇచ్చింది.అక్కడ స్టార్ హీరోలతో ఈ భామ జతకట్టింది.

ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఇప్పటికే ఒక సినిమాని పూర్తి చేసింది.

Advertisement

ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ టైంలో ఆమె చేసిన సోషల్ సర్వీస్ తో మరోసారి అందరిని ఆకర్షించింది.

ఇక ఈ భామ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుంది.అయితే అది హీరోయిన్ గా కాదు.రవితేజ క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ప్రణీతని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సాంగ్ ఇప్పటికే షూటింగ్ అయిపొయింది.ఇక సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి రవితేజ, ప్రణీత చేసిన సాంగ్ ని త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఐటమ్ గర్ల్ గా అయినా తెలుగులో ప్రణీతని మళ్ళీ గుర్తించి అవకాశాలు ఇస్తారేమో అనేది వేచి చూడాలి.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు