భర్తతో మొదటిసారి రొమాంటిక్ డాన్స్ చేసిన ప్రణీత సుభాష్.. వీడియో వైరల్?

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.

Advertisement
Pranitha Subash Romantic Dance With Her Husband Video Viral Details, Pranitha Su

ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

Pranitha Subash Romantic Dance With Her Husband Video Viral Details, Pranitha Su
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.కానీ తన భర్త ఫోటోలు ఎక్కువగా పంచుకోదు.పంచుకున్న కూడా ఫేస్ కనిపియ్యకుండా కవర్ చేస్తూ ఉంటుంది ప్రణీత.

Advertisement

ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన ఫేస్ కూడా కనిపించకుండా కవర్ చేస్తుంది.

ఇక తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో తన భర్తతో కలిసి రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది.మొదటిసారిగా తన భర్తతో స్టెప్పులు వేస్తూ కనిపించింది ప్రణీత.

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.దీంతో ఆ వీడియోని చూసిన తన ఫాలోవర్స్ బాగా లైకులు కొడుతున్నారు.

అంతేకాకుండా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ప్రణీత సినిమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం ఫ్యామిలీతోనే బిజీగా ఉంటుంది.ఇక తనకు కూతురు కూడా పుట్టడంతో ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి బాగా దగ్గరగా తాను ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.

ఒకవేళ ప్రణీత మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చినట్లయితే తనకు ఎటువంటి పాత్రలో వస్తాయో చూడాలి.

తాజా వార్తలు