వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.వైసీపీ విశాఖ గర్జనకు పోటీగా నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వైసీపీ నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపించారు.ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో రాష్ట్రానికి ఆదాయం లేకున్నా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు.ప్రపంచంలో ఎక్కడ మూడు రాజధానులు లేవని విమర్శించారు.
అసెంబ్లీలో జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారన్న ఆయన రాజధానిని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.