రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత( Praneetha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది.

మొదట బావ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ( Attarintiki Daredi )తెలుగు కుర్రకారు హృదయాలను దొచేసింది.కానీ ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు.

అలా తెలుగు తమిళంలో కొన్ని సినిమాలలో నటించింది.

ఇక కెరీర్ మంచి బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ( Nitin Raju )వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంటకు ఒక పాప కూడా జన్మించింది.ప్రస్తుతం ఒకవైపు కూతురి బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు డీ లాంటి షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రణీత మరో గుడ్ న్యూస్ ని తెలిపింది.తాను రెండోసారి తల్లి కానున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌ చేసింది.బేబీ బంప్‌ ఫొటోలను( Baby bump photos ) పంచుకున్న ప్రణీత.

రౌండ్ 2.

ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు అనే క్యాప్షన్‌ కూడా పెట్టారు.ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చేసిన మీడియాలో వైరల్ కావడంతో సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం పలుచోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పుడు మళ్లీ సెకండ్ ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో అభిమానులు ఒకవైపు ఆనంద పడుతూనే మరోవైపు నిరాశ పడుతున్నారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ప్రణీత మళ్లీ సినిమాలలో గిరి ఎంట్రీ ఇస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇలా మళ్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ తో మరింత దూరం పెరుగుతుంది అని తెలియడంతో అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు