నేను చెప్పిందేంటీ ..మీరు మాట్లాడేది ఏంటి పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయాలు సంచలనగా మారాయి.తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డు కల్తీ జరిగిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇలా గత ప్రభుత్వ హయామంలో లడ్డు తయారీలో కల్తీ జరిగిందనే విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.11 రోజులపాటు ఈ దీక్షలో ఉండబోతున్నారు.అయితే ఇవాళ ఉదయం ఈయన దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే.

ఇలా అమ్మవారి దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Prakash Raj React On Pawan Comments On Tirupathi Laddu Controversy Details, Tiru

ఈ మీడియా సమావేశంలో భాగంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) , హీరో కార్తీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు వీరంతా తిరుపతి లడ్డు( Tirupati Laddu ) గురించి చేసిన కామెంట్ల పట్ల పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే సినీ నటుడు కార్తీ( Karthi ) సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ప్రకాష్ రాజ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Prakash Raj React On Pawan Comments On Tirupathi Laddu Controversy Details, Tiru

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.ఇప్పుడే నేను మీ ప్రెస్ మీట్ చూశాను.నేను ట్వీట్ చేసింది ఏంటి మీరు దానిని అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటి? ప్రస్తుతం నేను షూటింగ్ పనుల నిమిత్తం విదేశాలలో ఉన్నాను 30వ తేదీ తర్వాత తిరిగి ఇండియా వస్తాను అప్పుడు మీ ప్రతి మాటకు నేను సమాధానం చెబుతాను.ఈలోగా మరోసారి నేను చేసిన ట్వీట్ చదివి అర్థం చేసుకోండి అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement
Prakash Raj React On Pawan Comments On Tirupathi Laddu Controversy Details, Tiru

ఇలా తిరుపతి లడ్డు వివాదంపై ఇటు రాజకీయాల పరంగా ఇటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ పలు రకాల కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు