బీజేపీతో పవన్ కలయికపై ప్రకాష్ రాజ్ విమర్శలు! ఆగ్రహంలో జనసైనికులు

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ, జనసేన ఎదగాలనే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీని కోసం రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణతో ముందుకి వెళ్తున్నాయి.

బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం వలన కొన్ని వర్గాలు వారు జనసేన పార్టీ మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.కమ్యూనిజం భావజాలం ఉన్నవారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

Prakash Raj Comments On Janasena Bjp Alliance-బీజేపీతో పవ�

అలాగే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలని, మోడీని వ్యతిరేకిస్తున్న వారు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అంటున్నారు.కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా స్టార్ నటుడు, మొదటి నుంచి బీజేపీకి, మోడీకి తీవ్ర వ్యతిరేకంగా పని చేస్తూ లౌకికవాదిగా ముద్ర వేసుకున్న ప్రకాష్ రాజ్ ఒక మీడియా ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.గతంలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మీద నిప్పులు చేరిన జనసేనాని ఇప్పుడు ఆ పార్టీతో భేషారతు పొత్తు పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటని, పవన్ కళ్యాణ్ నిర్ణయం తనని విస్మయానికి గురిచేసిందని, ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అనేది అర్ధం కాని విషయంగా ఉందని అన్నారు.

Advertisement

ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ మోడీ ఎలా మంచోడు అయిపోయాడో ఆయనే చెప్పాలని కూడా విమర్శించారు.అయితే పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలు పెద్ద అభ్యంతరకరంగా లేకపోయినా జనసైనికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రకాష్ రాజ్ కి తెలియకుండా మాట్లాడుతున్నారని, అవినీతి, ప్రతీకార రాజకీయాలు ఎక్కువైపోయాయని ఇలాంటి పరిస్థితిలో రెండు పార్టీల నుంచి ప్రజలని కాపాడాటానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, దీనిని ఆయన గ్రహిస్తే మంచిదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు