ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ నుంచి ‘అబ్బాక డర్’ పాట విడుదల

ప్రభుదేవా నటించిన మై డియర్ భూతం నుంచి తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండటంతో అన్ని వర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

 Prabhudeva My Dear Bhootam Movie Abbaca Darru Song Released Details, Abacca Darr-TeluguStop.com

నేడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్లు విడుదల చేశారు.

మాస్టర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌లో ప్రభుదేవా తన స్టెప్పులతో అందరినీ మెప్పించేశాడు.

ఇక ఈ ‘అబ్బాక డర్’ అనే పాట వినోదాత్మకంగా సాగుతుంది.ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే.

ఈ పాటను పిల్లలు చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డి ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.

ఆదిత్య సురేష్, సహన ఆలపించారు.డా.చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు.ఈ చిత్రానికి తెలుగులో మాటలను నందు తుర్లపాటి అందించారు.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ‘మై డియర్ భూతం’ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.

అశ్వంత్ తల్లిగా రమ్యా నంబీశన్ కనిపించనున్నారు.పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత వంటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా నటించారు.

బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, అలియా, సురేష్ మీనన్, లొల్లు సభా స్వామినాథన్ ముఖ్య పాత్రలను పోషించారు.

యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్వర్క్ టీమ్.

భారీ ధర చెల్లించి మై డియర్ భూతం ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నారు.

మై డియర్ భూతం ఈ జూలై 15వ తేదీన విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.

నటీనటులు :

ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వంత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

డైరెక్టర్: ఎన్.రాఘవన్, ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళై, బ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్, విడుదల : శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, మ్యూజిక్: డి ఇమ్మాన్, పాటల రచయిత : డా.చల్లా భాగ్యలక్ష్మీ, మాటల రచయిత : నందు తుర్లపాటి, సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube