ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సలార్' ఆ స్థాయిలో రిలీజ్.. ఇది ప్రభాస్ స్టామినా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే అంత లేట్ అవుతున్నాయి.

ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూడసాగారు.

కానీ సలార్ కూడా వాయిదాల పర్వంమే కొనసాగుతుంది.ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాకు ముందు నుండి భారీ డిమాండ్ ఉంది.ఈ సినిమా ప్రకటించగానే అంచనాలు పెరిగాయి.

ఎందుకంటే నీల్ కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.అందుకే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అనే హోప్స్ ను ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) పెట్టుకున్నారు.

Advertisement

కానీ ఇది సెప్టెంబర్ వాయిదా పడడంతో డీలా పడ్డారు.ఆ తర్వాత ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది.

డిసెంబర్ 22న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమా నుండి అతి త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.కాగా ఈ సినిమాను యూఎస్ లో దాదాపు 1979 కి పైగానే లొకేషన్స్ లో గ్రాండ్ గా రిలీజ్( Salaar Grand Release ) కానుందని అఫిషియల్ తెలిపారు.మరి ఈ స్థాయిలో ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత వరకు రిలీజ్ అవ్వలేదు.

మరోవైపు బాలీవుడ్ మూవీ, హాలీవుడ్ మూవీ పోటీలో ఉన్న ఈ స్థాయిలో రిలీజ్ చేయడంతో ప్రభాస్ స్టామినా తెలుస్తుంది.దీంతో ఓపెనింగ్స్ తోనే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement

తాజా వార్తలు