ప్రభాస్( Prabhas ) “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ( Salaar Part-1 Cease Fire ) ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యింది.తెలుగు సహా ఐదు భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) మరోసారి తన మార్క్ వైలెన్స్…”సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్ లో చూపించారు.హీరో ఎలివేషన్ విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది.
మూడు నిమిషాల 47 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను డబల్ చేసింది.

ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిన కథాంశంతో…“సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.విలన్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) కనిపిస్తున్నాడు.ఇదే సమయంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు దర్శకుడు టీనూ ఆనంద్, జగపతిబాబు, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించారు.
ట్రైలర్ లో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ గా చూపించడం జరిగింది.ప్రభాస్ డైలాగ్ లతో పాటు.యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి.వృషపరాజ్యాలతో సతమతమవుతున్న ప్రభాస్ “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” పైనే పోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది.







