వామ్మో.. దెయ్యం రోల్ లో ప్రభాస్.. చంద్రముఖి, కాంచన సినిమాలను మించి?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని కొంతమంది ప్రచారం చేశారు.అయితే ప్రభాస్ ఈ సినిమాలో దెయ్యం రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కథలో కొత్తదనం ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.చంద్రముఖి, కాంచన తరహా కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కనుందని అయితే కథ అంచనాలకు అందని విధంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ కామెడీ సీన్స్ లో అద్భుతంగా నటిస్తారు.ప్రభాస్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కాగా ప్రభాస్ త్వరలో ఈ సినిమా షూట్ లో పాల్గొంటారని బోగట్టా.ఈ సినిమాలో నిధుల అన్వేషణకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయని ఆ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

తాతామనవడి పాత్రల్లో ప్రభాస్ కనిపించనుండగా థ్రిల్లర్ సినిమాలను, హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.2023 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.ప్రభాస్ మారుతి ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు