Prabhas : ప్రభాస్ సినిమాల కోసం నిజంగానే అంత పెద్ద సాహసం చేశాడా .. నిజంగా గ్రేట్ !

ఇవాళ రేపట్లో సినిమా కోసం ఎవ్వరైనా ఎలాంటి సాహసం చేయడానికైనా వెనుకాడటం లేదు.

సినిమానే వారి జీవితం గా ఉంటుంది కాబట్టి ఆ సినిమా కోసం ఏ పని చేయడానికి అయినా ఓకే అంటున్నారు.

ఇక ఇలాంటి పని చేయడానికి సైతం ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు కూడా వెనకాడటం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది.విషయం ఏంటి అంటే బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో అది రాజులకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి అప్పట్లో రాజులు చెవులకి పోగులు పెట్టుకునేవారు.

అందుకని సినిమా యూనిట్ లో ఉండే అందరికీ దాదాపు పోగులు పెట్టారు.అయితే ప్రభాస్( Prabhas ) కి మాత్రం ఎందుకో పోగులు పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఊడిపోతూ ఉండేవట.

అలా ప్రతిసారి చెవుల కమ్మలు పడిపోవడం వల్ల ప్రభాస్ షూటింగ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడట.

Advertisement

దాంతో రాజమౌళి( Rajamouli ) ఒకసారి ఇక ఇలా కాదు చెవులు కుట్టించేసేయాలని నిర్ణయించుకొని రెండు చెవులు ప్రభాస్ కి కుట్టించాడట.అప్పటినుంచి షూటింగ్ బాగానే జరిగింది కానీ ఏళ్లకు ఏళ్లు అలా చెవులకి పెద్ద కమ్మలు పెడుతూ వచ్చారట.దానివల్ల ఫైట్స్ లాంటి సందర్భాల్లో అవి చాలా ఇబ్బంది పెట్టేవట.

ఇక రోజంతా అలా బరువైన చెవిపోగులు( Heavy Ear rings ) ఉండటం వల్ల నైట్ చెవులు బాగా లాగేవట ఎంతో పెయిన్ కూడా వచ్చేదట.ఇక సినిమా అయిపోయేంత వరకు కూడా వాటిని అలాగే మైంటైన్ చేయాల్సి వచ్చింది ప్రభాస్.

కేవలం కొన్ని రోజులు పెట్టుకోవడం వల్ల నా పరిస్థితి ఇలా ఉంది ఇక ఆడవారు ఎలా దీన్ని భరిస్తున్నారు అంటూ అప్పుడు అర్థమయిందట ప్రభాస్ కి.

నిజంగా ఆడవారు చాలా గొప్పవారు ప్రతి విషయాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు.అందుకు తగినట్టుగా తమను తాము మలుచుకుంటారు.కానీ ఈ రెండు పోగులు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

కానీ ఆడవారు ఎన్ని ఇబ్బందులు పడితే వారి జీవితం ముందుకు వెళుతుందో అని ప్రభాస్ అనుకునే వారట.అప్పటి నుంచి ఆడవారి పై రెస్పెక్ట్ ఇంకా పెరిగిందని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు