తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు సలార్ సినిమా( Salaar ) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
అయితే ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్( Advance Bookings ) ప్రారంభం కాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సలార్ నిర్మాతలు, బయ్యర్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు సలార్ సినిమా ను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే.వారు టికెట్ల రేట్ల ను( Salaar Ticket Rates ) భారీ ఎత్తున పెంచుకునేందుకు గాను అనుమతి అడుగుతున్నారు.
ఏపీ లో 40 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు అన్నట్లుగా అనుమతి దక్కింది.కానీ ఇంకో పది రూపాయలు చేసి 50 రూపాయలు పెంచుకోవచ్చు అంటూ అనుమతి ఇవ్వమంటున్నారు.

ఇక తెలంగాణ లో ఆర్ఆర్ఆర్ సినిమా కు ఏ రేట్లు అయితే అనుమతి ఇచ్చారో అవే రేట్ల ను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అంటే భారీ మొత్తం లో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గాను విజ్ఞప్తి చేస్తున్నారు.ఆ స్థాయి లో టికెట్ల రేట్ల పెంపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు.అందుకే ఇంకా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అవ్వలేదు.సోమవారం నాడు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతుందని అంతా భావించారు.

కానీ సోమవారం పంచాయితీ తెగలేదు.మంగళవారం సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎంతకు అనుమతి దక్కితే అంత పెంచి టికెట్ల రేట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి సలార్ సినిమా ను సామాన్యులు చూడలేనంత పెంచాలి అని మైత్రి వారు కోరుకుంటున్నారు.మొదటి వారం పది రోజులు పెంచిన టికెట్ల రేట్లు ఉంటాయి.కనుక ఆ వారం పది రోజుల్లోనే సినిమా కి బ్రేక్ ఈవెన్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.