మరో యంగ్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

ఇటీవలే ఆదిపురుష్( Adipurush ) వంటి భారీ సినిమాతో వచ్చి మరో ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయినప్పటికీ ఈయన నెక్స్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.మరి మరొక నెల రోజుల్లో ఈయన నటించిన సలార్ ( Salaar ) సినిమా రిలీజ్ కానుంది.

డిసెంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఇదైనా బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు వచ్చిన ప్లాప్స్ అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారు.

Advertisement

మరి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.ఇక దీంతో పాటు డార్లింగ్ చేతిలో కల్కి ( Kalki 2898 AD ) సినిమా కూడా ఉంది.

ఈ సినిమాపై కూడా భారీ హోప్స్ పెరిగాయి.

అలాగే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా స్టార్ట్ అయ్యి ఒక రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయినట్టు టాక్.ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే ప్రభాస్ మరో యంగ్ డైరెక్టర్ కు ఓకే చెప్పారని టాక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరంటే.దసరా ( Dasara ) వంటి బ్లాక్ బస్టర్ తో తనని తాను నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela ) కు డార్లింగ్ అవకాశం ఇచ్చినట్టు టాక్.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఇదే నిజమైతే శ్రీకాంత్ ఓదెల దశ తిరిగినట్టే.మరి ఒకవేళ నిజమైతే దసరా సినిమా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ప్రభాస్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు