ప్రభాస్( Prabhas ) అంటే ప్రపంచ హీరో అని మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం కానీ అక్కడ మ్యాటర్ ఆ రేంజ్ లో లేదు అని బాలీవుడ్( Bollywood ) వాళ్ళు చాల సార్లు సెటైర్స్ వేస్తున్నారు.పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.
అందుకే అతడి చాల మంది లైట్ తీసుకున్నారు.అయినా కూడా వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నారు.
ఇప్పటికి అయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయ్.అయితే మొన్నటి మొన్న వచ్చిన ఆదిపురుష్( Adipurush ) దెబ్బ ప్రభాస్ కి మాములుగా తగలలేదు.
అయినా కూడా ప్రభాస్ తన జోరును ఏమాత్రం తగ్గించకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు.
అయితే ప్రభాస్ విషయంలో చాల మంది దర్శకులు తప్పు మీద తప్పు చేస్తున్నారట.మరి ఆ దర్శకులు ఎవరు ? వారు చేస్తున్న తప్పులు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదటగా రాధేశ్యామ్ సినిమా( Radheshyam movie ) టైం లో అందరు ఆ సినిమా కు సంబంధించి రియాలిటీ షోలు వేస్తారని భావించిన ఆ చిత్ర దర్శకుడు లైట్ తీసుకున్నాడు.
దాంతో ఆ సినిమా పై అంచనాలు మరి ఎక్కువ అయిపోయి పరాజయం పొందింది.ఇక ఆదిపురుష్ సినిమా వచ్చేసరికి ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ లేకుండా సినిమా ప్రమోషన్స్ కానిచ్చేశారు.
ఆ సినిమా విడుదల అయినా తర్వాత దాని పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పే పనేముంది.
ఈ సినిమాల నుంచి ప్రభాస్ దర్శకులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు అని అనిపిస్తుంది.ఇప్పుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) అయన ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాకు ఎలాంటి ఈవెంట్స్ కానీ ఇంటర్వూస్ కానీ చేయడానికి సిద్ధంగా లేదట.పైగా ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు మాత్రం కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పని లేదు అనే డైలాగ్స్ తో సరిపుచ్చుకుంటున్నారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక ముందు వచ్చే ప్రాజెక్ట్ కె అయితే ట్రైలర్ కూడా ఇస్తారా ? ఇవ్వరా ? అనే అనుమానం అందరిలో మొదలైంది .సినిమా ఎలా ఉందొ మచ్చుకైనా చూపించకుండా ప్రమోషన్స్ చేయకుండా ఎలా హిట్ కొడతారు అనేది వేచి చూస్తే కానీ తెలియదు.