ఐతే బెల్లంకొండ 'ఛత్రపతి' వార్తలు నిజమేనన్నమాట

ఈమద్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు హిందీలో వరుసగా రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే.

పాత సినిమాలు కూడా ఇప్పుడు రీమేక్‌కు సిద్దం అవుతున్న నేపథ్యంలో ప్రభాస్‌ మరియు రాజమౌళి కాంబోలో వచ్చిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ చత్రపతిని హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అన్నట్లుగానే భారీ ఎత్తున అంచనాలతో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హిందీ వర్షన్‌కు తగ్గట్లుగా కథలో మార్పులు చేర్పులు కూడా చేశారు.

రీమేక్‌ విషయం నమ్మకంగానే ఉంది.కాని రీమేక్‌ లో నటించబోతున్నది బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అంటే మాత్రం జనాలు నమ్మేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

Prabhas Chatrapathi Movie Remake In Bollywood With Bellamkonda Sai Srinivas , Be

తెలుగులోనే హీరోగా ఎక్కువ సక్సెస్‌లు దక్కించుకోలేక పోయిన బెల్లంకొండ బాబు హిందీలో ఎంట్రీ ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.కాని ఆయనకు ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ కారణంగా ఏకంగా బాలీవుడ్‌ లోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.బాలీవుడ్‌ లో చత్రపతి సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆయన కుటుంబ సభ్యులే రీమేక్‌ చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Prabhas Chatrapathi Movie Remake In Bollywood With Bellamkonda Sai Srinivas , Be

ఆ విషయంలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున టాక్‌ వినిపిస్తుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ రీమేక్‌ లో నిజంగానే బెల్లంకొండ బాబు నటించబోతున్నాడు.దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

బెల్లంకొండ బాబు ఇమేజ్‌కు తగ్గట్లుగా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే చత్రపతిగా బెల్లంకొండ నటించబోతున్నది నిజమే అనిపిస్తుంది.

ప్రస్తుతం బెల్లంకొండ అల్లుడు అదుర్స్‌ సినిమాను చేస్తున్నాడు.ఆ తర్వాత ఈ రీమేక్‌ మొదలు అయ్యేనేమో చూడాలి.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు