షారుఖ్ కి భయపడుతున్న ప్రభాస్ అభిమానులు..!

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌( Sharukh khan ) హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్‌ సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

పఠాన్ సినిమా ను ఈ ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఇక జవాన్‌ సినిమా( Jawan Movie ) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ రెండు సినిమా లు కూడా వెయ్యి కోట్లు వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.

రికార్డ్‌ స్థాయి వసూళ్లు సాధించిన షారుఖ్‌ గత చిత్రాల నేపథ్యం లో డుంకీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.డుంకీ సినిమా హీరో షారుఖ్ ఖాన్‌ అవ్వడం తో పాటు, దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాణీ అవ్వడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.పఠాన్‌, జవాన్ సినిమా లతో పోల్చితే డుంకీ సినిమా ఇంకాస్త ఎక్కువ బాగుంటుంది అంటూ షారుఖ్ ఖాన్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షారుఖ్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ నమ్మకం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది.ప్రభాస్ నటించిన సలార్ సినిమా( Salaar )ను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

అదే తేదీ లో డుంకీ ని కూడా విడుదల చేయబోతున్నారు.

భీకరమైన ఫామ్‌ లో ఉన్న షారుఖ్‌ ఖాన్‌ మూవీ( Sharukh khan ) కి పోటీ గా సలార్‌ ను విడుదల చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ముందు ముందు సలార్‌ క్రిస్మస్ కి విడుదల చేసి తప్పు చేశాం అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మరియు నిర్మాతలు బాధ పడాల్సి వస్తుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వెయ్యి కోట్లు వసూళ్లు చేయగల సత్తా ఉన్న మూవీ సలార్‌.ఇక డుంకీ కూడా వెయ్యి కోట్ల మూవీ అంటున్నారు.కనుక రెండు వెయ్యి కోట్ల సినిమా లు ఒకే రోజు రావడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

కేవలం సలార్ కి మాత్రమే కాకుండా డుంకీ కి కూడా డ్యామేజీ తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement

తాజా వార్తలు