సలార్ క్లైమాక్స్ ప్లాన్ అదుర్స్.. ఏకంగా 400 రౌడీలతో ప్రభాస్ ఫైటింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఇప్పుడు భారీ సినిమాలు ఉన్నాయి.

మరి ఈయన చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ సలార్ (Salaar) ఒకటి.

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడం అనే చెప్పాలి.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.

ఎట్టకేలకు చివరి దశకు అయితే తీసుకు వచ్చాయి.ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.

Prabhas And Prashanth Neels Salaar Update Details, Shruti Haasan, Prabhas, Prash
Advertisement
Prabhas And Prashanth Neels Salaar Update Details, Shruti Haasan, Prabhas, Prash

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ ఏకంగా 400 రౌడీలతో ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేసాడని.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.

అంతేకాదు ఈ క్లైమాక్స్ లోనే ప్రభాస్ రెండవ క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు.చూడాలి మరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలను పెట్టుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని వండర్స్ ను క్రియేట్ చేస్తుందో.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు