ప్రభాస్, మారుతి కాంబో సినిమాకు నిర్మాతలు వాళ్లే.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా నిర్మాతలు ఎవరు అనే విషయం గత కొన్నాళ్లుగా క్లారిటీ లేదు.

గతం లో ఒక సారి మేము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమా ను నిర్మిస్తున్నారని పేర్కొన్నాము.

ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం తో అభిమానులతో పాటు ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు.మొదట దానయ్య వీరి కాంబినేషన్ సినిమా ను నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

అది నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వం లో సినిమా ను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ విషయం నిరూపితమైంది.

Advertisement

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విజయోత్సవ వేడుక పీపుల్స్ మీడియా వారి ఆఫీసు లో జరిగింది.రవితేజ తో పాటు ధమాకా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ పార్టీ లో ప్రభాస్ మరియు మారుతి లు కూడా ఈ పార్టీ లో పాల్గొన్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీసు లో ప్రభాస్ సందడి చేసిన వీడియో లు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

పీపుల్స్ మీడియా వారు ప్రభాస్ కి సుస్వాగతం అంటూ ఒక ఫ్లెక్సీ ని కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.కేవలం పీపుల్స్ మీడియా వారి బ్యానర్‌ లో నటిస్తున్న కారణంగానే ప్రభాస్ ధమాకా సినిమా యొక్క సక్సెస్ పార్టీకి హాజరయ్యారని తెలుస్తోంది.

ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.మీడియా వారు ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన ఉగాది కి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement