యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెల్సిందే.ఆదిపురుష్ యొక్క తిరుపతి( Tirupati ) ఈవెంట్ కు రికార్డ్ స్థాయి లో జనాలు వచ్చారు.
తిరుపతిలోని గల్లీ గల్లీ ప్రభాస్ ( Prabhas )అభిమానులతో నిండి పోయింది.వెయ్యి మందికి పైగా పోలీసులు ఈ కార్యక్రమానికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది.

వారు మాత్రమే కాకుండా మరో వెయ్యి మందితో ట్రాఫిక్ మరియు జనాలను మానిటరింగ్ చేయడం జరిగింది.ఇక ప్రభాస్ ఒక్కడి సెక్యూరిటీ కోసం ఏకంగా 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్( Private security guard ) లను మరియు బాంబ్ స్క్వౌడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.పోలీసు వారి సెక్యూరిటీ మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం వల్ల నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగిందని తెలుస్తోంది.కార్యక్రమ నిర్వాహకులు సెక్యూరిటీ కోసం దాదాపుగా పాతిక లక్షల రూపాయలను ఖర్చు చేశారంటూ సమాచారం అందుతోంది.

ఒక సినిమా హీరోకు… అది కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను ఈ స్థాయిలో సెక్యూరిటీ కోసం ఖర్చు చేయడం ఇదే మొదటి సారి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ సభ్యులు ఖర్చు చేయడం జరిగింది.ఈ మధ్య కాలంలో ఈ స్థాయి లో ఖర్చు చేయడం ఇదే మొదటి సారి అన్నట్లుగా చర్చ జరుగుతోంది.అతి త్వరలోనే ప్రభాస్ మరో సినిమా సలార్( Salar ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సినిమా ఈవెంట్ ఎలా ఉంటుందో అంటూ అంతా ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆదిపురుష్ సినిమా ను ఈనెల 16న థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నారు.







