జూన్ 10న 'భగవంత్ కేసరి'' నుండి మరో బిగ్ సర్ప్రైజ్ లోడింగ్!

Powerful Teaser Of Bhagavanth Kesari Getting Ready Details, Balakrishna, Anil Ravipudi, NBK108, Sreeleela, Bhagavanth Kesari, Kajal Agarwal,Balakrishna Birthday Update,Balakrishna New Movie Update,Bhagavanth Kesari Movie Teaser Update

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) జూన్ 10న తన పుట్టిన రోజును( Balakrishna Birthday ) జరుపుకో నున్నారు అనే విషయం బాగా తెలుసు.ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య బర్త్ డే రోజు వచ్చే ట్రీట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంగా మేకర్స్ నుండి అదిరిపోయే అప్డేట్ ఈ రోజు బయటకు వచ్చింది.

 Powerful Teaser Of Bhagavanth Kesari Getting Ready Details, Balakrishna, Anil Ra-TeluguStop.com

గత రెండు మూడు రోజుల నుండి పుట్టిన రోజుకు బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది అని ఊరిస్తున్న ఫ్యాన్స్ కు ఈ రోజు మంచి మాసివ్ ట్రీట్ ఇచ్చాడు.

బాలయ్య అనిల్ సినిమాకు ”భగవంత్ కేసరి”( Bhagavanth Kesari ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఈ రోజు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ టైటిల్ లాంచ్ చేసారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తి అయ్యింది.ఇక ఈ రోజు టైటిల్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే టైటిల్ లాంచ్ మాత్రమే కాదు.బర్త్ డే రోజు మరింత బ్లాస్టింగ్ అప్డేట్ ఉందని మేకర్స్ మరోసారి ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.థమన్ ఈ సినిమా నుండి సర్ప్రైజ్ ఉందని సోషల్ మీడియా వేదికగా అనిల్ ను అడుగగా నిజమే అని అనిల్ రావిపూడి తెలిపారు.ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి సినిమాలకు నెక్స్ట్ లెవల్లో ఆల్బమ్స్ అందించిన థమన్ ఈ సినిమాకు కు వర్క్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

మరి జూన్ 10న ఫస్ట్ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారేమో అనేది చూడాలి.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube