పోసాని కృష్ణమురళి ఆ డైరెక్టర్ ని చంపాలి అనుకున్నాడా..ఇంత పగ ఎందుకు..?

ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా మరియు రచయితా ఇలా అన్నీ విభాగాలలో సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు.

అలాంటి వారిలో ఒక్కరు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ).

ఈయన డైలాగ్ డెలివరీ, నటన మరియు ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి.ఇండస్ట్రీ లో రచయితగా ఈయన ఎంతో మంది స్టార్ హీరోలకు పని చేసాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ సినిమా గోకులం లో సీత అనే చిత్రానికి రచయితా ఈయనే.అలా రచయితగా కొనసాగిన ఈయన, డైరెక్టర్ గా కూడా సక్సెస్ లు అందుకున్నాడు.

ఆపరేషన్ దుర్యోధన మరియు మెంటల్ కృష్ణ( Mental Krishna ) వంటి సినిమాలు కమర్షియల్ గా పెద్ద విజయాలుగా నిలిచాయి.ఇందులో మెంటల్ కృష్ణ అనే సినిమాలో ఆయనే హీరో కూడా.

Advertisement
Posani Krishnamurali Thought To Kill That Director..why So Much Revenge..? Posa

అంతే కాదు క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా , విలన్ గా కూడా ఈయన ఎన్నో వందల సినిమాల్లో నటించాడు.

Posani Krishnamurali Thought To Kill That Director..why So Much Revenge.. Posa

కమెడియన్ గా అయితే నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ లో ఈయన హవానే నడిచింది.ఏడాదికి పది నుండి 20 సినిమాలకు పైగా చేసేంత డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళి.కేవలం సినీ నటుడుగా మాత్రమే కాదు , రాజకీయ నాయకుడిగా కూడా పోసాని కృష్ణమురళి బాగా ఫేమస్ అయ్యాడు.

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పోసాని కృష్ణమురళి, ప్రస్తుతం వైసీపీ పార్టీ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది ఈయన ముఖ్యమంత్రి జగన్ కి సపోర్టు చేస్తూ పవన్ కళ్యాణ్ మీద చేసిన నీచమైన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అలాంటి మాటలు మాట్లాడినందుకే పోసాని కృష్ణ మురళి కి ఇప్పుడు ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు విశ్లేషకులు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ ప్రారంభం లో జరిగిన కొన్ని విషయాలను పంచుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియా( Social Media ) లో హాట్ టాపిక్ గా మారాయి.

Posani Krishnamurali Thought To Kill That Director..why So Much Revenge.. Posa
షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

పోసాని కృష్ణ మురళి ముక్కుసూటితనంతో పొయ్యే వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే.మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు,ఎవరికీ తల వంచడు.ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కూడా ఆయన అలాగే ఉండేవాడట, ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కె రాఘవేంద్ర రావు దగ్గర ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఉండేవాడు.

Advertisement

అప్పట్లో రాఘవేంద్ర రావు గారు( Raghavendra Rao ) నెంబర్ 1 డైరెక్టర్, ఈయన దగ్గర జాగ్రత్తగా పని చెయ్యాలి అనుకున్నాను.ఒకరోజు ఆయన దగ్గర ఉండే సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ ఏమయ్యా కృష్ణ మురళి, పైన ఒక ప్యాడ్, వైట్ పేపర్స్ మరియు పెన్ ఉంది, అది తీసుకొని క్రిందకి వచ్చి కారు ఎక్కు అన్నాడు, నేను వాటి కోసం వెతికాను కానీ కనపడకపొయ్యేసరికి ఆ కో డైరెక్టర్ పేరు పిలిచి ఇక్కడేమి లేవు తాళం వేసి ఉంది అని చెప్పాను.

సరే వచ్చి కార్ ఎక్కు అన్నాడు, వెళ్లి ఎక్కాను, లోపల కూర్చున్న తర్వాత ఆ కో డైరెక్టర్ ఏరా బలుపా నీకు.నన్నే పేరు పెట్టి పిలుస్తావా, నిన్ను ఇండస్ట్రీ లో లేకుండా చేస్తాను అన్నాడు.

అప్పుడు నేను వెంటనే కార్ ఆపమని చెప్పి, సరే ఇక నుండి మిమల్ని సార్ అని పిలుస్తాను, కానీ ఇందాక నన్ను పేరుతో ఎందుకు పిలిచావు రా ఇడియట్ అంటూ అతనిని కార్ లో నుండి తోస్తే రోడ్ బయట పడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు పోసాని, అలా చాలా మంది డైరెక్టర్స్ తో కూడా గొడవలు అయ్యాయట, కొన్నిసార్లు చంపాలని కూడా అనుకున్నాని పోసాని కృష్ణ మురళి ఈ సందర్భంగా తెలిపాడు.

తాజా వార్తలు