క్రేజీ కాంబో లో అవకాశం దక్కించుకున్న పూర్ణ... ఇక దబిడి-దిబిడే

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు.

అలాంటి కాంబినేషన్ లో ముందుగా చెప్పుకొనే జంట బాలకృష్ణ, డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్.

వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తూ ఉంటారు.గతంలో వీరిద్దరి కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమా లు ఏ రేంజ్ లో సూపర్ హిట్ ను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

Poorna Join In Balakrishna-Boyapati Movie Balakrishna, Boyapati Srinu, Simha L

అందుకే మరోసారి వీర్దిదరి కాంబినేషన్ లో మూవీ అనగానే ప్రతిఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరి ముఖ్యంగా బాలయ్య అభిమానులు అయితే మాత్రం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో ఇప్పటికే బాలయ్య పక్కన హీరోయిన్ గా మలయాళ భామ కు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు మరో హీరోయిన్ గా పూర్ణ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.బాలయ్య పక్కన ఒక హీరోయిన్ గా మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేయాగా, ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ గా పూర్ణను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడం తో ఈ చిత్రానికి మరింత ప్రత్యేకత సంతరించుకుంది.దానికి తోడు ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే వీటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం మరింత ఆసక్తి కలిగిస్తుండగా, మరో పాత్రలో మాత్రం పల్లెటూరు వ్యక్తి తరహా లో పంచె కట్టి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఇటీవల లాక్ డౌన్ తో ఈ చిత్ర షూటింగ్ ను నిలిపివేశారు.

అయితే ఇప్పుడు ఏడు నెలల గ్యాప్ తరువాత ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదలవ్వడం తో అందరూ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.హీరో బాలయ్య బాబు సైతం షూటింగ్ కు హాజరై షెడ్యూల్ ప్రకారం సినిమా సన్నివేశాల్లో నటిస్తున్నారు.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు