సంచలన పోస్ట్ చేసిన పూనమ్ కౌర్... దెబ్బకు దిగివచ్చిన డిప్యూటీ సీఎం!

రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అధికంగా రావడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.దీనితో ఎన్నో ప్రాంతాలు,నగరాలు జలమయం అయ్యాయి.

ముఖ్యంగా ఏపీలోని విజయవాడ( Vijayawada ) మొత్తం జలదిగ్బంధంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ తరుణంలోనే అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సరైన సమయానికి తిండి నీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు.దీంతో ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు ఈ పరిస్థితిని చూసి చలించిపోయి పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు( CM Chandrababu Naidu ) తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Jaganmohan Reddy ) కూడా వరద ప్రభావ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ఉన్నారు.ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ఎక్కడ స్పందించలేదు.దీంతో పెద్ద ఎత్తున ఈయనపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ఈ సమయంలోనే సినీనటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.ఇలాంటి సమయంలోనే రాజకీయ నాయకులు రావాల్సింది.

బయట ప్రజల వద్ద లేకపోతే అలాంటి రాజకీయ నాయకులు కేవలం మాటల నాయకుడు చేత కానీ నాయకుడిగా మిగిలిపోతారు ఇలాంటి లీడర్ అవకాశవాది అవుతారు అంటూ ఒక ట్వీట్ చేశారు.

ఇక ఈమె ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేశారని తెలిసిన అభిమానులు ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికే పవన్ కళ్యాణ్ తన పట్ల వస్తున్నటువంటి ఇలాంటి వార్తలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు తాను ఇలాంటి సమయంలో బయటకు రాకపోవడానికి కారణం ఏమీ లేదని తాను కనుక బయట కనపడితే సహాయ చర్యలకు ఎంతో ఆటంకం ఏర్పడుతుంది అందుకే తాను బయటకు రాలేకపోతున్నాను అంటూ అసలు విషయాన్ని తెలియజేయడమే కాకుండా తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.దీంతో పవన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు