టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఒకప్పుడు సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ప్రస్తుతం అడపాదనప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో తల దూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.ఇలా ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ విషయంతో వార్తలు నిలిచే పూనమ్ కౌర్ హెల్త్ కండిషన్ అంతా బాగోలేదట.
మరి ఇంతకీ ఈ పూనమ్ కి ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.గతంలో తను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడిన విషయాన్ని బయటపెట్టింది.పూనమ్ కౌర్ గతంలో ఫైబ్రోమయాల్జియా( Fibromyalgia ) అనే సమస్యతో బాధపడిందట.
ఇది కూడా ఓ రకమైన మయోసైటిస్ లాంటిదే.ఫైబ్రోమయాల్జియా బాధితులు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు.శరీరం నిస్సత్తువుగా మారుతుంది.
అలసటతో పాటు నిద్రలేమితో బాధపడతారు.ఈ సమస్యతో తను చాన్నాళ్లు బాధపడినట్టు వెల్లడించింది పూనమ్ కౌర్.
చేతులు, కాళ్లు పట్టేసేవని, టైట్ గా ఉండే దుస్తులు ధరించలేక, దాదాపు రెండేళ్ల పాటు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాల్సి వచ్చిందని వెల్లడించింది.అలా చాన్నాళ్లు బాధపడిన తర్వాత నేచురోపతిలో పేరుగాంచిన మంతెన సత్యనారాయణ( Manthena Satyanarayana )ను కలిశానని, ఆయనిచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy