టాలీవుడ్‌లో పూజ హెగ్డే శకం ముగిసిందా.. ఇక తెలుగు సినిమాల్లో కనిపించడం కష్టమే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ పరిచయమే.ఇక ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

 Pooja Hegdes Era In Tollywood Is Over Is It Difficult To Appear In Telugu Movies-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

2010లో సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా అడుగుపెట్టిన పూజా.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయం.

నిజానికి దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.ఇక అలా వైకుంఠపురంలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అలా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది.

అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.

ఇక మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.ఓ వైపు బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు బాగా అందుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.

తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Oka Laila Kosam, Pooja Hegde, Sitaram, Tollywood-Movie

అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.ఇదంతా పక్కన పెడితే.మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు కనిపించడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కనిపించడంతో ఇక ఈ ముద్దుగుమ్మ కూడా త్వరలో తెలుగు ఇండస్ట్రీ నుండి దూరం అవుతుందేమో అని అనుమానాలు వస్తున్నాయి.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె శకం ముగిసింది అని వస్తున్న వార్తలతో నెటిజన్లు మంచి పని అయ్యింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.తను ఒక ఐరన్ లెగ్గు అంటూ ముద్ర వేస్తున్నారు.

మొన్నటి వరకు దర్శకులకు గోల్డెన్ లెగ్గుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.తనకు సీతారామం సినిమాలో కూడా అవకాశం వచ్చింది అనడం తో.ఆ సినిమాలో నటించకుండా మంచి పని చేశావు.లేదంటే ఆ సినిమా కూడా ప్లాఫ్ అయ్యేది అని కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే కు బాగా నెగిటివిటీ చోటు చేసుకుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube