పొన్నియన్‌ సెల్వన్‌@100 కోట్లు... బ్రేక్‌ ఈవెన్‌ కి ఇంకా ఎంత?

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన పొన్నియన్‌ సెల్వన్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో రెండు పార్ట్‌ లుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Ponniyin Selvan Movie Collections ,ponniyin Selvan,100crores, Dasara Movies,baah-TeluguStop.com

ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఘనంగా ప్రకటించారు.అయితే సినిమా కు పెట్టిన బడ్జెట్, అయిన బిజినెస్, చేసిన ప్రమోషన్ కి తగ్గట్లుగా కలెక్షన్స్ రావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.100 కోట్ల వసూళ్లు రాగానే గొప్పలు చెప్పుకోవడం కాదు.ఈ సినిమా కు ప్రమోషన్ చేసినట్లుగా కనీసం 1000 కోట్ల వసూళ్లు అయిన రావాలి అంటూ కొందరు మీడియా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ను బాహుబలి సినిమా కు మించి ఉంటుందంటూ కొందరు ప్రచారం చేశారు.కనుక బాహుబలి సినిమా స్థాయి లో కాకున్నా కనీసం సగం వసూళ్లు అంటే 500 నుండి 600 కోట్ల రూపాయల వసూళ్లు అయినా రావాలి అంటూ చాలా మంది చాలా రకాలుగా చిత్ర యూనిట్ సభ్యులను విమర్శిస్తున్నారు.

Telugu Aishwarya Rai, Baahubali, Dasara, Jayam Ravi, Karthi, Maniratnam, Ponniyi

ఒక సినిమా ను తెరకెక్కించే విధానం ను.దాన్ని ప్రమోట్ చేసే విధానం రాజమౌళి ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.అలా కాదని రాజమౌళి సినిమా నే మేము క్రాస్ చేస్తామంటూ బీరాలు పలికితే ఇలాగే ఉంటుంది అంటూ కొందరు ఎదేవా చేస్తున్నారు.మొత్తానికి విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాష్ రాజ్ ఇంకా ఎంతో మంది హేమాహేమీలు నటించిన కూడా మొదటి మూడు రోజుల్లో 100 కోట్ల వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి అంటే లాంగ్ రన్ లో ఈ సినిమా కనీసం 300 కోట్ల రూపాయల వసూళ్లనైనా నమోదు చేస్తుందా అంటే డౌటే అంటూ చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి వారం తర్వాత తమిళనాడులో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ సినిమా కనిపించే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చాలా దారుణమైన ఫలితాన్ని అవకాశముంది.

ఈ వారంలో దసరా సినిమాలు రాబోతున్నాయి.కనుక ఈ సినిమా ను చూసేది నాధుడే ఉంటాడు.

అందువల్ల సినిమాను తీసేసే అవకాశాలు లేకపోలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube