ఏ పార్టీలో ఉన్నా షర్మిలకు ఆ విషయం లో మద్దతు ఇస్తాను

ఖమ్మం జిల్లా ముఖ్య రాజకీయ నేతల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) ఒకరు అనడంలో సందేహం లేదు.

వైకాపా తో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పొంగులేటి రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్ ( TRS )లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.

టీఆర్‌ఎస్ లో జాయిన్ అయిన కొన్నాళ్లకే ప్రాముఖ్యత తగ్గించారని పొంగులేటి ఆరోపిస్తున్నాడు.సీటు ఇవ్వకుండా అవమానించడం మాత్రమే కాకుండా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పొంగులేటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా ఖమ్మం లో మాత్రం పొంగులేటి ప్రభావం చూపిస్తాడు అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు.

Ponguleti Srinivas Reddy Want To Support To Ys Sharmila , Ponguleti Srinivas Red

ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ టీవీ పార్టీ ( YSRCp Party )గురించి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి అంత మెరుగ్గా లేదు.కనుక ఆ పార్టీ ని నమ్ముకోవాలని నేను అనుకోవడం లేదు.

Advertisement
Ponguleti Srinivas Reddy Want To Support To Ys Sharmila , Ponguleti Srinivas Red

కానీ ముందు ముందు వైఎస్ షర్మిల( YS Sharmila ) గారు నన్ను అన్నయ్య అంటూ పిలుస్తారు కనుక కచ్చితంగా ఆమె కు మద్దతుగా నిలుస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.తాను జాయిన్‌ అవ్వబోతున్న పార్టీ తో సంబంధం లేకుండా షర్మిలకు పాలేరు లో సహాయంగా నిలుస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

పార్టీ లో జాయిన్‌ అయ్యేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.ఆ ఫ్యామిలీ పై తనకు విశ్వాసం ఉందని ఆయన పేర్కొంటూ ఉంటాడు.అదే విషయాన్ని షర్మిల విషయంలో పాటిస్తాను అన్నట్లుగా పొంగులేటి అన్నాడు.

Ponguleti Srinivas Reddy Want To Support To Ys Sharmila , Ponguleti Srinivas Red

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు చెందిన ఏ ఒక్కరు కూడా ఖమ్మం నుండి గెలవకుండా నేను చూసుకుంటాను అన్నట్లుగా పొంగులేటి ఒక చిట్ చాట్ లో పేర్కొన్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా కూడా షర్మిల యొక్క పార్టీ పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పొంగులేటి శ్రీనివాస్ యొక్క పట్టుదలతో బీఆర్ఎస్ నుండి వయటకు వచ్చేశాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు