తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్ లో ఉదయం 11 గంటల వరకు 30.06 శాతం పోలింగ్ నమోదైంది.మెదక్ జిల్లాలో 30.42 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 29.54 శాతం, సిద్దిపేట జిల్లాలో 28.08 శాతం, భూపాలపల్లిలో 27.80 శాతం, పెద్దపల్లి జిల్లాలో 26.41 శాతం, ములుగు జిల్లాలో 25.36 శాతం, నిర్మల్ జిల్లాలో 25.10 శాతం, కామారెడ్డి జిల్లాలో 24.70 శాతం, ఖమ్మం జిల్లాలో 23.68 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 23.68 శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 23.10 శాతం పోలింగ్ నమోదు అయింది.అదేవిధంగా జనగామ జిల్లాలో 23.25 శాతం, నారాయణపేట్ జిల్లాలో 23.11 శాతం, నాగర్ కర్నూలు జిల్లాలో 22.19 శాతం, జగిత్యాల జిల్లాలో 22.5 శాతం, సిరిసిల్ల జిల్లాలో 22.02 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 శాతం, సంగారెడ్డి జిల్లాలో 22 శాతం, కరీంనగర్ జిల్లాలో 20.09 శాతం, రంగారెడ్డి జిల్లాలో 16.84 శాతం, మేడ్చల్ జిల్లాలో14.74 శాతం, హైదరాబాద్ లో 12.39 శాతం పోలింగ్ నమోదైంది.