కొండముచ్చుకు ఓఆర్ఎస్.. మంచి మనసు చాటుకున్న పోలీసులు!

కొందరు వ్యక్తులు మానవీయతను చాటుతూ ఉంటారు.వారు కేవలం వారి స్వభావాన్ని చాటడమే కాదు.

 Policemen Gave Ors To Langoor In Uttarakhand Details, Police Gave Ors, Police, U-TeluguStop.com

ఎదుటివారికి ఆదర్శంగా కూడా నిలుస్తుంటారు.ముఖ్యంగా పోలీసు వృత్తిలో ఉన్న వారు తమ స్వభావాన్ని తరచూ చాటి చెబుతుంటారు.

కొందరు తమ మంచితనాన్ని అప్పుడప్పుడు బయటకు చూపిస్తుంటారు.

తాజాగా ఓ ఘటన కూడా వారి మంచి మనసును అందరికీ చాటి చెబుతోంది.

అసలేం జరిగిందో ఈ వార్త చదివి తెలుసుకోండి.అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్.

పలువురు పోలీసులు కావడి వద్ద సెక్యూరిటీగా పని చేస్తున్నారు.వారి వద్దకు ఓ కొండముచ్చు వచ్చింది.

మామూలుగా వచ్చి వెళ్తుంటాయి కదా అని మామూలుగానే ఉన్నారు.కానీ కాసేపటి తర్వాత దానిని చూసిన పోలీసులకు ఏదో తేడాగా అనిపించింది.

పరీక్షించి చూడగా.ఆ కొండముచ్చు ఆరోగ్యం బాలేదని గమనించారు.

అది చాలా నీరసంగా ఉన్నట్లు గ్రహించారు.వారి వద్ద ఉండే ఓఆర్ఎస్ ద్రావణాన్ని దానికి ఇస్తే కాస్త అయినా ఉపశమనంగా ఉంటుందని అనుకున్నారు.వారి వద్ద ఉన్న వాటర్ బాటిల్ లో ఆ ఓఆర్ఎస్ పౌడర్ పోసి ఆ నీటిని ఆ కొండ ముచ్చుకు అందించి దాని దాహాన్ని తీర్చారు.కొండముచ్చుకు పోలీసులు చేసిన సాయాన్ని అక్కడే ఉన్న మరొకరు వీడియా తీశారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.అది కాస్త వైరల్ గా మారింది.

పోలీసులు చేసిన ఈ పని ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube