రూఫ్ టాప్ పై నుండి ఐపీఎల్ చూస్తూ కిందపడి మరణించిన పోలీస్ అధికారి!

టిక్ టాక్ వాడటమే కాదు IPL చూడటం కూడా ప్రాణాలమీదకు తెస్తుందని ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయిన తరువాత తెలిసింది.

వివరాల్లోకి వెళితే రాయగడ్ లోని ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ శాఖకు చెందిన దాస్ అనే కానిస్టేబుల్ IPL మాచ్ చూస్తుండగా చనిపోయాడు.

అందిన సమాచారం ప్రకారం అతను మంగళవారం జరిగిన KKR మరియు CSK మ్యాచ్ ను చూస్తుండగా ప్రమాదవశాత్తు 3వ అంతస్థు మీద నుండి కిందపడి చనిపోయాడు.వెంటనే అతన్ని పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా గాయాలు తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Police Fallen From Roof Top Watching Ipl IPL, CSK VS KKR, Police Officer, Das,

దాస్ నబరంగపూర్ జిల్లా లోని టెంటులిఖుంటికి చెందినవాడని, 2013 లో కొరపుట్ లోని OSAP 3rd బెటాలియన్ లో చేరాడని, 5 నెలల క్రితం రాయగడ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడని పోలీసులు తెలిపారు.ఇంతకుముందు కూడా టిక్ టాక్ స్టార్ మరియు సోషల్ మీడియా స్టార్ ప్రతీక్ కత్రి కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.

అలాగే ముంబై లో ఒక మహిళ టిక్ టాక్ చేస్తూ మ్యాన్ హోల్ లో పడి 22km ల అవతల ఉన్న డ్రైనేజీ లో దొరికింది.

Advertisement
అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

తాజా వార్తలు