పట్టపగలు మహిళను అసభ్యంగా తాకిన నీచుడు.. వీడియో చూస్తే రక్తం మరుగుద్ది!

ఇటీవల కాలంలో ఆడవాళ్లకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది.రోడ్డు మీద స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

మొన్నటికి మొన్న ఒక యువతి ఒక వీధిలో వ్లాగ్ చేస్తూ వెళ్తుండగా ఒక బాలుడు ఆమెను లైంగికంగా వేధించాడు.ఆమె బ్రెస్ట్‌ను అసభ్యంగా తాకి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు.

తాజాగా డెహ్రాడూన్‌లో( Dehradun ) ఇలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.నవంబర్ 7న తన కుమార్తెతో కలిసి నడుస్తున్న ఒక తల్లిని కిషన్‌సింగ్( Kishan Singh ) అనే వ్యక్తి అసభ్యంగా తాకాడు.

అతడు చేసిన ఈ వికృత, పైశాచిక చేష్టలు సమీపంలోని ఓ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ఈ వీడియోలో కిషన్‌సింగ్ స్కూటర్ పై వెళ్లడం చూడవచ్చు.అతను వెళ్తున్న వీధిలో ఓ మహిళ( Woman ) తన కుమార్తెతో కలిసి నడుస్తోంది.కిషన్‌సింగ్ స్కూటర్ పై ఎదురుగా వచ్చి ఆ తల్లి బ్రెస్ట్‌ను తాకాడు.

వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది.అతడు కామంతో కళ్లు మూసుకుపోయి కావాలనే ఇలా ప్రవర్తించాడని అర్థమవుతోంది.

ఈ చర్యతో సదరు మహిళ షాక్ అయి పోయింది.ఆమె తన కూతుర్ని దగ్గరికి తీసుకుని నిస్సహాయంగా ఆ కామాంధుడి వైపు చూడటం మనం గమనించవచ్చు.

వీడియో వైరల్ అయ్యాక సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.దీంతో స్థానిక పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు.

ఎంత పని చేస్తివి డ్రైవరు.. బస్సులో ఎక్కిన ప్రయాణికుల ఆభరణాలు కొట్టేసిన డ్రైవర్ (వీడియో)
మూడు ప్రయత్నాల్లో ఫెయిల్.. నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్.. అభిలాష సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

ఈ దారుణ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Advertisement

పోలీసుల స్పందనను ప్రశంసిస్తూనే, ఈ రకమైన ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.తమకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఈ పనులు చేసే వారికి అమ్మ, అక్క, చెల్లి ఉండరా, వాళ్లకూ ఇలాంటివే జరిగితే తట్టుకోగలరా? అని ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి వారిని చూస్తే రక్తం మరిగిపోతుంది అని ఇంకొందరు కామెంట్లు చేశారు.

డెహ్రాడూన్‌ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, "మహిళల భద్రతను( Women Security ) కాపాడటం మా బాధ్యత.ఈ రకమైన ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం.మహిళలు భయం లేకుండా నడవగలిగే సమాజాన్ని నిర్మించడానికి మేం కృషి చేస్తున్నాం.

" అని తెలిపారు.కిషన్ సింగ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసి తమ కస్టడీలోని తీసుకున్నారు.

అతను చేతులు జోడించి కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

తాజా వార్తలు