తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీ చేసిన పోలీస్.. ఫ్యామిలీ కంటే దేశం ముఖ్యమంటూ?

తాజాగా న్యూ ఢిల్లీలో( New Delhi ) జరిగినటువంటి జీ 20 సదస్సు వేడుకలు ఎంతో ఘనంగా ముగిసాయి.

ఇక ఈ కార్యక్రమం కోసం ఎంతోమంది ఉద్యోగులు అంకితభావంతో పనిచేయడం వల్ల ఈ వేడుకలు ఎంతో సక్సెస్ అయ్యాయి.

ఇక ఈ సదస్సులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi )విందు ఏర్పాటు చేశారు.ఇందులో కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు 275 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని పిలిచారు.

ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడానికంటే ముందుగా -20లో విధుల్లో పాల్గొన్నవారితో అనుభవాలను చెప్పాలని ప్రధాని కోరారు.

ఈ సందర్భంగా సురేష్( Suresh ) అనే ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.దేశంలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్న భారత్ మండపంలో తన డ్యూటీ ఉందని ఇన్‌స్పెక్టర్ సురేష్ చెప్పారు.తాను ఇక్కడ డ్యూటీలో ఉండగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ తన కన్నతల్లి ఫూల్పతి దేవి( Phoolpati Devi ) గుండెపోటుకు గురయ్యారు అంటూ తన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు.

Advertisement

అయితే ఆమె గుండెపోటుకు గురైనటువంటి కొన్ని నిమిషాలకే మరణించారని తెలిపారు.కానీ తన తల్లి మరణించినప్పటికీ దేశసేవే దేశ భద్రతే ముఖ్యం అని భావించినటువంటి సురేష్ కనీసం తన తల్లి చివరి చూపులకు కూడా వెళ్లకుండా డ్యూటీ చేస్తూనే ఉన్నారు.

అతను ప్రధాన వేదిక వద్ద భద్రతలో ఉన్నారు.చాలా కీలకమైన బాధ్యతల్లో తాను విధిని నిర్వహిస్తుండటంతో ఇంటికి వెళ్లకుండా ఉద్యోగ బాధ్యతలోనే ఉండిపోయారు ఇక ఈ విషయాన్ని సురేష్ తెలియజేయడంతో ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి గురయ్యారు.ఇలా ఈ సదస్సు కారణంగా తనకున్నటువంటి అనుభవాలను చెప్పమని కోరడంతో తన తల్లి చనిపోయినప్పటికీ విధులు నిర్వహించానని చెప్పడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈయన ప్రశంసలు కురిపించారు.

సురేష్ కుమార్ తన తల్లి స్వర్గానికి వెళ్లిపోయారని చెప్పారు.అలాంటి కొడుకు పుట్టాడని అతని తల్లి గర్విస్తుంది.దేశం కోసం కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం అంటూ ఈ సందర్భంగా మోడీ ఇన్స్పెక్టర్ సురేష్ పై ప్రశంసలుకు కురిపించారు.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు