బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయరాజే సింధియా గౌరవార్థం దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయరాజే సింధియా పేరిట 100 రూపాయల నాణెన్ని తాజాగా రిలీజ్ చేశారు.విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్మారక నాణెన్ని సోమవారం ఉదయం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి రాజకీయాలదాకా రాజమాత ముఖ్యపాత్ర వహించారని మోదీ చెప్పారు.నాడు ఏక్తా యాత్ర సమయంలో విజయరాజే తనను గుజరాత్ యువ నాయకుడిగా పరిచయం చేశారని నాటి రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు.
రాజమాతకు జనసంఘం అధ్యక్షురాలిగా ఉండమని నాడు అటల్ జీ, అద్వానీలు కోరగా, ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించి సాధారణ జనసంఘ్ కార్యకర్తగా సేవలు చేశారని ప్రధాని గుర్తుచేశారు.
గత 60 ఏళ్లలో భారతదేశానికి ఓ దిశను చూపిన ప్రముఖ రాజకీయవేత్తలలో రాజమాత సింధియా ఒకరని, ఆమె నిర్ణయాత్మక నాయకురాలని మోదీ చెప్పుకొచ్చారు.
స్వాతంత్య్రానికి ముందు విదేశీ దుస్తుల కాల్చడం మొదలుకుని, రామ మందిరం ఆందోళన వరకు ఆమె అనుభవం గొప్పదని ఆ విషయాల గురించి తెలిపారు.రామజన్మభూమి కోసం ఆమె చాలా కష్టపడ్డారని, ఆమె శత జయంతి వేళ ఆ కల సాకారం అవ్వడం సంతోషంగా ఉందన్నారు.








