వైరల్ వీడియో: ప్రధానిని మెప్పించిన నాలుగేళ్ల చిన్నారి పాట..!

పాట అనేది అంతర్జాతీయంగా అందరూ ఆస్వాదించగల విషయం.ఇక మన భారత దేశంలోని మిజోరం ప్రజలకు మాత్రం పాట అంటే ఓ మాతృభాష లాగా.

ప్రముఖ సంగీతకారుడు ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన మా తుజే సలాం అనే పాటను మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి పాట పాడి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.అయితే ఈ పాటను ఆలపించడానికి ఓ బలమైన కారణం ఉందని చెప్పవచ్చు.

Four-year-old Mizoram Girl Sings Maa Tujhe Salam By AR Rahman,PM Narendra Modi L

ఇందుకు కారణం మేం భారతీయులం భారతీయులం.భారతయులందరు తమ సోదర సోదరీమణులు అని ప్రజల తరపున ఈ పాప బలంగా వినిపించిందని తెలుస్తోంది.

భారతదేశంలో నిజానికి అత్యంత ఆనందకరమైన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మిజోరం.అయితే అత్యధిక శాతం ఆ రాష్ట్రానికి చెందిన కొంతమందిని చూడటానికి అచ్చం టిబెటన్ లేదా బర్మా దేశానికి చెందిన వారు లాగా కనపడటంతో వారిని వేరే దేశస్తులు గా పరిగణించేవారు.

Advertisement

వీరిని చూస్తే నిజంగా ఇటు దక్షిణ భారతదేశంలో, అటు ఉత్తర భారతదేశంలో చెందిన కొన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా వారు వేరే దేశం నుంచి వచ్చిన వారే అని పొరపాటు పడటం మామూలే.అలా అవుతున్న నేపథ్యంలోనే ఇదివరకు 1966లో మిజోరం రాష్ట్రం వాళ్ళు భారతదేశం నుంచి విడిపోవడానికి ఆయుధాలు చేపట్టారు.

అందుకోసం మిజో నేషనల్ ఫ్రంట్ అనే తిరుగుబాటు ఉద్యమానికి కూడా దారి తీసింది.అయితే ఆ సమయంలో భారత వైమానిక దళం ఆ తిరుగుబాటుని బాగా అణచివేసింది.

అలా వారు 20 సంవత్సరాల పాటు కాస్త కష్టాలను ఎదుర్కొన్నారు అని చెప్పవచ్చు.అందుకే కాబోలు స్థానికంగా మిజోరం వాసులు వారి రాష్ట్రాన్ని రాంభూయి అని వ్యవహరిస్తారు.

అలా కాలం గడుపుతున్న సమయంలో జూన్ 30, 1982 లో మిజో నేషనల్ ఫ్రంట్ అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి ఒప్పందం కారణంగా అక్కడ ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి.అయితే ఇప్పటికి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

ఈ నేపథ్యంలో భాగంగానే నాలుగేళ్ల చిన్నారితో ఈ పాట పాడించి వారు శాంతియుతంగా వారి బాధను తెలిపేందుకు ప్రయత్నించారు.ప్రస్తుతం నాలుగేళ్ల చిన్నారి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అంతేకాదు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ పాటను చూసి అద్భుతం అంటూ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

తాజా వార్తలు