మహాలయ పక్షంలో అమ్మాయిలు పిండప్రదానాలు చేయవచ్చా?

భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులు పితృ పక్షం లేదా మహాలయ పక్షం అంటారు.

ఈ మహాలయ పక్షం అక్టోబర్ 6వ తేదీ ముగియనుంది.

ఈ అమావాస్యలోపు చనిపోయిన పెద్దవారికి పిండ ప్రధానం చేయడం వల్ల మన పై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని, పితృ దేవతల ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.అయితే పిండప్రధానం అనగానే ఎక్కువగా ఇంటి వారసులు చేయాలని చెబుతుంటారు.

మరి పిండప్రధానం అమ్మాయిలు చేయకూడదా.అనే సందేహం అందరికీ కలుగుతుంది.

మరి పిండప్రధానం అమ్మాయిలు చేయకూడదా.చేస్తే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement
Pitru Paksha Shradh Can Daughters Do Pind Daan Daughters, Pind Daan, Pitru Paksh

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పితృదేవతలకు కొడుకులు పిండప్రదానం చేయాలి.అయితే కొడుకు వివాహమైన తర్వాత ఆ పిండ ప్రధాన కార్యక్రమాలలో తన భార్య పాల్గొనవచ్చు.

అదేవిధంగా పిండప్రధానం ఇంట్లో ఇద్దరు కుమారులు ఉంటే మొదటి కుమారుడికి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ పెద్ద కుమారుడు మరణించి ఉంటే రెండవ కుమారుడు తప్పకుండా పిండప్రదానం చేయాలి.

అయితే పిండ ప్రదానం చేసే సమయంలో ఆ కార్యానికి కావలసిన పనులన్నింటిలో కూడా స్త్రీ పాల్గొంటుంది కనుక ఒకవేళ కుమారులు లేనిపక్షంలో అమ్మాయిలు పిండప్రధానం చేయవచ్చు.

Pitru Paksha Shradh Can Daughters Do Pind Daan Daughters, Pind Daan, Pitru Paksh

ఇలా ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు వదలడం వల్ల మన పై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోయి వారి ఆత్మ సంతోషిస్తుంది.ఈ క్రమంలోనే పిండ ప్రదానాలు చేసిన తర్వాత మన స్థాయి కొద్ది దానధర్మాలు చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు