పిగ్మెంటేషన్ సమస్యనుంచి బయట పడటానికి.... టమోటా ఫేస్ ప్యాక్స్

శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ముఖం మీద చర్మం ముదురు రంగులోకి మారుతుంది.దానినే పిగ్మెంటేషన్ సమస్య అని అంటూ ఉంటాం.

ఈ సమస్య పరిష్కారానికి టమోటా చాలా బాగా సహాయపడుతుంది.టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మరియు పోషకాలు ఈ నల్లని ప్యాచెస్ ని తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఇప్పుడు ఈ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.

Advertisement
Tomato Face Packs For Removing Pigmentation Details, Tomato Face Packs, Pigmenta

అయితే ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి.

Tomato Face Packs For Removing Pigmentation Details, Tomato Face Packs, Pigmenta

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు