ఏప్రిల్ 1 నుంచి పిఎఫ్ కొత్త రూల్స్ ఏంటంటే..??

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది.పీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం తెలుసుకోవాలి.

అది ఏంటంటే వచ్చే నెల నుంచి పీఎఫ్ కొత్త రూల్స్ మారానున్నాయి.ఈ రూల్స్ ప్రకారం రూ.2.5 లక్షలకు పైన పీఎఫ్ ఫండ్‌ పై ట్యాక్స్ పడుతుంది.కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్ సమావేశంలోనే తెలియజేసింది.అయితే ఈ బడ్జెట్ ప్రాతిపదికన ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.2.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను అనేది ఉండదు. కానీ ఈ లిమిట్ దాటితే మాత్రం తప్పనిసరిగా పన్ను కట్టాలిసి ఉంటుంది.అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది.కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ లిమిట్ రూ.5 లక్షల వరకు ఉంది.

Pf New Rules From April 1st April 1st, New Rules, Epf Rules, Epf Account

ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ కలిగిన వారు తమ పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా డివైడ్ చేసుకోవలిసి వస్తుంది.అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్‌లో వేసుకుని మిగతా డబ్బులు మరో అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది.దీని వల్ల పన్ను లెక్కింపు సులభతరం అవుతుంది.

Advertisement
PF New Rules From April 1st April 1st, New Rules, EPF Rules, EPF Account -ఏ�

అలాగే ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతోంది.రూ.2.5 లక్షలు దాటి ఇన్వెస్ట్ చేసే మొత్తంపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ పడుతుందని గుర్తు పెట్టుకోండి.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు