నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని ఆరోపిస్తూ గొల్లగూడెంకు చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.







