జనసేనాని రుషికొండ పర్యటనకు అనుమతి..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది.

ఈ మేరకు పవన్ వాహనంతో పాటు మరో ఏడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు.

ఈ క్రమంలో మిగతా వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.కాగా విశాఖలోని జోడుగుళ్లపాలెం నుంచి పవన్ కల్యాణ్ రుషికొండకు వెళ్లనుండగా అభిమానులకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయితే జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో మూడో విడత వారాహి విజయ యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement